యాదగిరి ఆలయ ఈవో రాజీనామా

Yadagiri Gutta: తిరిగి గీతారెడ్డి పదవీకాలన్ని పొడగించిన ప్రభుత్వం

Update: 2023-12-21 12:12 GMT

యాదగిరి ఆలయ ఈవో రాజీనామా

Yadagiri Gutta: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. 2014లో ఆమె యాదాద్రి ఆలయ ఈవోగా నియామకమయ్యారు. 2020లో పదవి విరమణ అనంతరం తిరిగి ప్రభుత్వం ఆమెనే ఈవోగా కొనసాగించింది. అయితే ఆలయ ఈవో గీత పైన స్థానిక ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి పలువురు అధికారుల నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పనితీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం వివరించినట్లు సమాచారం.

కేవలం శనివారం మాత్రమే స్థానిక భక్తులు దర్శనానికి రావాలనే నిబంధనలతో ఈవో తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆమె పదవీకాలం ముగిసినా గత ప్రభుత్వం తిరిగి పదవి అప్పగించడంతో ఇష్టారాజ్యంతో పలు నిబంధనలు విధించి ప్రజలను, కింది స్థాయి సిబ్బందిని, భక్తులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒక దశలో స్థానిక జర్నలిస్టులకు సైతం అనేక ఆంక్షలు విధించిందనే ఆరోపణలు ఈవో ఎదుర్కొంది. ఇప్పటికైనా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని యాదాద్రి ఆలయ ఈవోగా నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News