యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిపోయిన కళ్యాణ మండపం

Yadagirigutta: కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల తిరుకళ్యాణ మహోత్సవం

Update: 2024-03-19 02:40 GMT

యాదగిరిగుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు.. భక్తులతో కిక్కిరిసిపోయిన కళ్యాణ మండపం

Yadagirigutta: యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి ప్రధాన ఘట్టమైన కళ్యాణ మహోత్సవం పూర్తైంది. ఆలయ మాడ వీధిలోని ప్రత్యేక కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల తిరు కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు అర్చకులు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం.. రెండు గంటల పాటు జరిగింది.

స్వామివారికి ప్రభుత్వం తరఫున తిరు కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేదపారాయణాలు, మంగళవాయిద్యాల నడుమ నరసింహస్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తుల నారసింహ, గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

Tags:    

Similar News