Yadadri Temple Arranged Amenities for Devotees: సకల సదుపాయాలతో యాదాద్రి

Yadadri Temple Arranged Amenities for Devotees: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణిస్తున్న పంచనారసింహక్షేత్రం యాదాద్రి పనులు ఎట్టకేలకు తుదిదశకు చేరుకున్నాయి.

Update: 2020-07-07 04:45 GMT

Yadadri Temple: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మాణిస్తున్న పంచనారసింహక్షేత్రం యాదాద్రి పనులు ఎట్టకేలకు తుదిదశకు చేరుకున్నాయి. దీంతో అధికారులు భక్తుల సౌకరయార్ధం కావలసిన మౌలిక వసతుల ఏర్పాటుపై దృష్టి సారించారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు సోమవారం అధికారులు, కాంట్రాక్టర్లు, స్థపతులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది దశ పనులను వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రధానాలయంలో మూలవరుల పున్యదర్శనం ప్రారంభమయ్యేనాటికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఆలయ దక్షిణభాగంలో ఇటీవల కుంగిపోయిన ప్రాంతంలోకి కృష్ణశిలలను పూర్తిగా తొలిగించి.. పచ్చిక బయళ్లను పెంచాలని సూచించారు.

ఆలయ దర్శనానికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా శివాలయంలోని ఉపాలయాలను కృష్ణశిలలతో నిర్మించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కిషన్‌రావు, ఆలయ ఈవో గీతతో కలిసి శివాలయంలోని నిర్మాణాలకు స్టోన్‌ కలర్‌ వేసేపనులను ప్రారంభించారు. కొండపైకి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో సంర్శకులకు ఆహ్లాదం కలిగించే విధంగా సుగంధం వెదజల్లే మొక్కలు నాటడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. ప్రధానాలయానికి ఇత్తడి కిటికీలను అమర్చే పనులు ఊపందుకొన్నాయి. ఆయల పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని సౌకర్యాల కల్పన చేపట్టాలన్నారు. భక్తులు వసతితో పాటు ఆలయ దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యే చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. కిషన్‌రావు వెంట ఈవో గీతతోపాటు ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఆర్కిటెక్టు ఆనందసాయి, ప్రధాన స్థపతి ఆనందాచార్యుల వేలు, ఈఈ వసంత్‌నాయక్‌, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. 


Tags:    

Similar News