Etela Rajender: ఈటలకు నేటి నుంచి వై కేటగిరి సెక్యూరిటీ
Etela Rajender: బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది
Etela Rajender: ఈటలకు నేటి నుంచి వై కేటగిరి సెక్యూరిటీ
Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నేటి నుంచి వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ అమల్లోకి రానుంది. ఈటలకు ప్రాణహాని ఉందని నివేదికలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వై కేటగిరిలో భాగంగా.. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తన హత్యకు కుట్ర చేస్తున్నారని ఇటీవల ఈటల రాజేందర్ తో పాటు ఆయన భార్య జమున ఆరోపణలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. ఇటీవల తమకు ఎదురైన సంఘటనలను ఈటల కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. ఇంటెలిజెన్స్ సైతం ఈటలకు ప్రాణహాని ఉందని నివేదిక ఇవ్వడంతో..తెలంగాణ ప్రభుత్వం ఈటల రాజేందర్‌కు వై- ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది..