Jagtial: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ ఎస్సై దుర్మరణం

Update: 2025-02-04 07:02 GMT

ఘోర రోడ్డు ప్రమాదం..మహిళ ఎస్సై దుర్మరణం

Jagtial: జగిత్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు దగ్గర కారు-బైక్ ఢీకొన్న ఘటనలో ఎస్సై శ్వేతతోపాటు మరొకరు మరణించారు. కారు మొదట బైక్ ను ఢీ కొట్టి ఆ తర్వాత చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఎస్సై శ్వేత కారును డ్రైవ్ చేస్తున్నారు. ఆర్నకొండ నుంచి జగిత్యాల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె డెడ్ బాడీని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శ్వేత విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె గతంలో కోరుట్లు, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లిలో ఎస్సైగా పనిచేశారు.

ఈ మధ్యే కోరుట్ల నుంచి జగిత్యాల డీసీఆర్బీకి ట్రాన్స్ ఫర్ అయ్యారు. సోమవారం రాత్రి స్వగ్రామం చొప్పదండి మండలం ఆర్నకొండుకు వచ్చి ఉదయం జగిత్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయే క్రమంలో ఆమె కారు చెట్టును బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో స్పాట్ లోనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. బైక్ వస్తున్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందినవాడిగా గుర్తించారు. 

Tags:    

Similar News