Telangana: వ్యవసాయంలో రాణిస్తున్న మహిళలు

Telangana: వ్యవసాయం దండగ కాదు పండుగ అంటూ మహిళ రైతులు నిరూపిస్తున్నారు

Update: 2021-03-08 02:45 GMT

మహిళా రైతు (ఫైల్ ఫోటో)

Telangana: మహిళలు అన్ని రంగాల్లో పురుషుడితో పాటు దూసుకుపోతున్నారు. తాము దేంట్లోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అంటూ మహిళ రైతులు నిరూపిస్తున్నారు. భూమి దున్నడం దగ్గర నుంచి.. విత్తి నాటి.. కలుపు తీసి.. పురుగు పడితే పిచికారి.. పంట చేతికొచ్చినప్పుడు తూర్పురపట్టడం.. పంటను మార్కెట్‌ అమ్మడం వరకు పనులు చేసి భేష్ అనిపిస్తున్నారు. పట్టుదలతో ఏ పని చేసిన విజయం సాధించవచ్చని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మహిళ రైతులపై ప్రత్యేక కథనం

మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషుడు చేసే ఏ పనినైనా తాము చేసి నిరూపిస్తున్నారు. ఇన్నాళ్లు తామకే సాధ్యమని విర్రవీగిన పురుషులకు ధీటుగా వ్యవసాయంలోనూ మహిళలు రాణిస్తున్నారు. అలాంటి మహిళే బద్దం వెంకటమ్మ.. ఆమెది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామం. ఊరికి సర్పంచ్‌గా ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు. వెంకటమ్మ భర్త చనిపోయినప్పటి నుంచి ఇంటి పనులతో పాటు అటు పొలం పనులు కూడా తానే చూసుకుంటూ వచ్చేది.. మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.

వ్యవసాయం అంటేనే నేటితరం దూరంగా ఉంటున్న సమయంలో ఆ పనులను చక్కబెడుతూ ఔర అనిపిస్తుంది మరో మహిళ రైతు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన యువ మహిళా రైతు సునీత తనకున్న ఎనిమిది ఎకరాల పొలంలో వరి సాగు చేస్తుంది. నారు పోసిన నాటి నుంచి పురుషులకు ధీటుగా సునీత పనిచేస్తుంది. ఎరువులు చల్లడం, పురుగుల మందు పిచికారి చేయడం వరకు అన్ని పనులు చేస్తోంది. వ్యవసాయం పనులను మహిళలు చేస్తూ ఔర అనిపిస్తున్నారు. నారు పోసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చి మార్కెట్‌ లో అమ్మేవరకు అన్నీ తామై చూసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News