గర్భిణీకి పురుడు పోసిన 108 సిబ్బంది

Mancherial: మంచిర్యాల ముల్కలపేటలో ఘటన

Update: 2022-12-15 08:30 GMT

గర్భిణీకి పురుడు పోసిన 108 సిబ్బంది

Mancherial: ఓ గర్భిణీకి 108 సిబ్బంది పురుడు పోసిన ఘటన మంచిర్యాల జిల్లా ముల్కలపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మౌనిక కు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. గర్భిణీని అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. మార్గమధ్యంలో అంబులెన్స్‌ను ఆపి 108 సిబ్బంది గర్భిణీకి సుఖప్రసవం చేశారు. దీంతో గర్భిణీ కుటుంబ సభ్యులు అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News