నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ మళ్ళీ గెలుస్తారా?
ఇందూరు ఓటర్లు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికి...బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ మళ్ళీ గెలుస్తారా?
ఇందూరు పార్లమెంట్ ఎన్నికల పోరు.. తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఎమ్మెల్యేలుగా ఓడి...పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో..గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.
ఇందూరు ఓటర్లు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. త్రిముఖ పోటీగా భావిస్తున్నప్పటికి...బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ లోక్‌సభ బరిలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు.
ఇందూరు పార్లమెంట్ పరిధిలో మున్నూరు కాపు, ముస్లిం, పద్మశాలి ఓట్లు గణనీయంగా ఉన్నాయి. తర్వాత ముదిరాజ్, రెడ్డి, యాదవ, గౌడ్ ఓట్లు చెప్పుకొదగ్గ స్దాయిలో ఉన్నాయి. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలు...ఇందూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ది ధర్మపురి అర్వింద్‌కు 4,80,584 ఓట్లు వస్తే...బీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 4,09, 709 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి మధుయాష్కీ 69,240 ఓట్లు సాధించారు. 2014లో జరిగిన త్రిముఖపోరులో కల్వకుంట్ల కవిత...లక్షా 67వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో కవితపై ధర్మపురి అర్వింద్...70 వేల మెజార్టీ సాధించారు. నిజామాబాద్ నియోజకవర్గంలో మొత్తం 141,96,593 మంది ఓటర్లు ఉన్నారు. 2014లో 69.10 శాతం పోలింగ్ నమోదైతే...2019లో 68.44 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా ఎన్నికల్లో 71.92 శాతం పోలింగ్ నమోదవడంతో...పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలిస్తుందని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, మూడు సార్లు తెలుగుదేశం అభ్యర్థులు గెలిచారు. బీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో సారి విజయం సాధించారు. మొత్తం 16, 89, 957 ఓటర్లు ఉంటే... పురుషుల ఓట్లు 7,99,458, మహిళలు 8, 90,499 మంది ఓటర్లు ఉన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు...మాస్‌లీడర్‌గా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. బలమైన మున్నూరు నేత కావడం, బీజేపీపై వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని బాజిరెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన జీవన్‌రెడ్డికి నాలుగు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటం, టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేయడం, సిట్టింగ్ ఎంపీ అర్వింద్ పై ఉన్న వ్యతిరేకతను నమ్ముకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అర్వింద్...మోదీ ఛరిష్మా అడ్వాంటేజ్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఈజీగా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు.