సస్పెన్షన్ పై ఎందుకు బులెటిన్ ఇవ్వలేదు: మీడియాతో చిట్‌చాట్‌లో జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: అసెంబ్లీ నుంచి తనను ఏ కారణంతో సస్పెండో చేశారో చెప్పాలని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జి. జగదీశ్ రెడ్డి చెప్పారు.

Update: 2025-03-24 05:32 GMT

సస్పెన్షన్ పై ఎందుకు బులెటిన్ ఇవ్వలేదు: మీడియాతో చిట్‌చాట్‌లో జగదీశ్ రెడ్డి

Jagadish Reddy: అసెంబ్లీ నుంచి తనను ఏ కారణంతో సస్పెండో చేశారో చెప్పాలని మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జి. జగదీశ్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తన సస్పెన్షన్ కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ఇంతవరకు ఎందుకు బులెటిన్ ఇవ్వలేదో చెప్పాలన్నారు. సస్పెన్షన్ కు సంబంధించి ఎలాంటి బులెటిన్ ఇవ్వన్నందుకు తనను అసెంబ్లీకి రాకూడదని చెప్పడానికి వీల్లేదన్నారు. ఇవాళనైనా తన సస్పెన్షన్ కు సంబంధించి బులెటిన్ ఇస్తారో లేదో చూస్తానన్నారు. ఒకవేళ అలా చేయకపోతే స్పీకర్ ను కలుస్తానని ఆయన అన్నారు.

అసెంబ్లీని ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పద్దతి ప్రకారంగా అసెంబ్లీ నడవడం లేదన్నారు. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీని నడుపుతున్నారని ఆయన విమర్శించారు. మందబలంతో అసెంబ్లీ నడుపుతామని అంటే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తన సస్పెన్షన్ కు సంబంధించి బులెటిన్ ఇవ్వాలని వారం రోజులుగా అడుగుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి సమాధానం లేదన్నారు. సస్పెన్షన్ అయిన వెంటనే అందుకు సంబంధించి బులెటిన్ ఇవ్వాలి... కానీ, వారం రోజులుగా తన విషయంలో ఎందుకు బులెటిన్ ఇవ్వలేదో చెప్పాలన్నారు. సస్పెన్షన్ విషయమై కోర్టుకు వెళ్తాననే భయంతో బులెటిన్ ఇవ్వలేదేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News