శానంపూడి సైదిరెడ్డి ఎవరు ?

Update: 2019-10-24 13:05 GMT

ఉత్కంట భరితంగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో కారు స్పీడ్ ని హస్తం అడ్డుకోలేకపోయింది. టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,624 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. భారీ మెజారిటీతో గెలిచి ఇక్కడ రికార్డు బ్రేక్ రికార్డు చేసారు సైదిరెడ్డి. దీనితో అసలు ఈ సైదిరెడ్డి ఎవరు ? అయన జీవిత నేపధ్యం ఏంటి అని సర్చ్ చేయడం మొదలు పెట్టారు.

శానంపుడి సైదిరెడ్డి 1974, ఏప్రిల్‌ 18వ తేదీన సూర్యాపేట జిల్లాలో జన్మించారు. అయన అక్కడే పదవతరగతి వరకు అక్కడే చదువుకొని ఇంటర్మీడియట్, డీగ్రీ హుజుర్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో పూర్తి చేసారు. ఆయనకి 2002లో రజీతరెడ్డితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

కెనడాలో ఉన్న సైదిరెడ్డి కేసీఆర్ ఉద్యమానికి ప్రభావితుడు అయి అక్కడి నుండి సొంత ఊరుకి వచ్చేసారు.మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఉమ్మడి జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే యువతకి అన్ని రకాలుగా సహాయపడుతూ వస్తున్నారు. తన తండ్రి పేరు మీదాఓ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేసి సామాజిక కార్యక్రమాలను అందజేస్తున్నారు.

మొదటిసారిగా 2018లో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి పోటి చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సైదిరెడ్డికి కల్పించారు. కానీ ఆ ఎన్నికల్లో అయన పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటి చేసి ఓడిపోయారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గానికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉండగా టీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ సైదిరెడ్డికే సీటును ఇచ్చి బరిలో నిలిపింది.. ఈ ఎన్నికల్లో అయన గెలిచి భారీ విజయాన్ని పొందారు. 

Tags:    

Similar News