ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి? కారణం ఏంటి?
ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది
ఈ ఏడాది ఎండలు ఎందుకు మండుతున్నాయి? కారణం ఏంటి?
ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దేశంలో ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణంలో అసాధారణ మార్పులు వస్తున్నాయి.
ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కారణం ఏంటి?
వాతావరణంలో వస్తున్న మార్పులు ఉష్ణోగ్రతలు పెరిగేందుకు కారణమౌతున్నాయి. ఇది పరోక్షంగా ప్రకృతి విపత్తులకు దారి తీస్తోంది. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టికి ఉష్ణోగ్రతల పెరుగుదల పరోక్షంగా కారణమౌతోంది. కర్బణ ఉద్గారాలు మండే ఎండలకు కారణమౌతున్నాయి. అడవుల నరికివేత కూడా పరోక్షంగా ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. ధ్రువాల్లో మంచు వేగంగా కరిగిపోతోంది. దీంతో గాలి వీచే వేగం పడిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2100 నాటికి గాలి వీచే వేగం 10 శాతం తగ్గిపోవచ్చని ఐసీసీసీ అంచనా వేసింది.
ఎల్‌నినోతో ఉష్ణోగ్రతల పెరుగుదల
ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎన్‌నినో ఒక కారణం. ఎల్‌నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ లో ఎక్కువ భాగం ఉపరితల సముద్రం వేడేక్కుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు దాదాపు 0.1 నుంచి 0.2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగాయి. వ్యవసాయ కార్యకలాపాలు, అటవీ నిర్మూలన ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైంది. వాతావరణ వేడిలో దాదాపు 90 శాతం సముద్రం ద్వారా గ్రహిస్తాయి. తద్వారా సగటు సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.దక్షిణ అమెరికా పరిసరాల్లోని పసిఫిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఉష్ణ జలాలు పశ్చిమం వైపుగా అంటే ఆసియా వైపు కదలడాన్ని ఎల్ నినో అంటారు.
సముద్రాలు ఎందుకు వేడెక్కుతున్నాయి?
నాలుగైదు ఏళ్లుగా సముద్రాలు అధికంగా వేడేక్కుతున్నాయి. 2023, 2024 సంవత్సరాల్లో సముద్ర జలాలు అసాధారణంగా పెరిగాయి. 1980 చివరి నాటికి ప్రతి ఏటా 0.06 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. ప్రస్తుతం అవి దశాబ్దానికి 0.27 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరిగింది. 2023 నుంచి 2024 ప్రారంభం వరకు అంతర్జాతీయ సముద్ర ఉష్ణోగ్రతలు వరుసగా 450 రోజులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.