Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వర్షాలు..వాతావరణ శాఖ

Update: 2020-09-19 05:14 GMT

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని నదులు, చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద ప్రభావం నుంచి కొలుకోక ముందే రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి.

తెలంగాణ విదర్భ ప్రాంతాలకు అనుకొని 0.9 కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. తెలంగాణ విదర్భ ప్రాంతాలకు అనుకొని 0.9 కిలోమీటర్ల ఎత్తున ఆవర్తనం కొనసాగుతోందన్నారు.16 డిగ్రీల లాటిట్యూడ్ వెంబడి షీర్ జోన్ లు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

రేపు ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తా ,దక్షిణ ఒడిశా పశ్చిమ బంగాళాఖాతం మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, వీటి ప్రభావంతో రాగాల 3రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇవాళ ,రేపు ఒకటి ,రెండు చోట్ల భారీ వర్షాలు ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అదే విధంగా వనపర్తి, వికారాబాద్, జోగులంభ గద్వాల ,మహబూబ్ నగర్ ,నల్గొండ ,నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు ఉత్తర కోస్తాలో కూడా ఇవాళ రేపు ఒకటి ,రెండు చోట్లా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద న్నారు.

గడిచిన24 గంటల్లో జోగులంభ గద్వాల జిల్లాలోని థరూర్ లో 12.8 cm అతిభారీ వర్షం కురిసింది. ఇటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ లో 10.8 cm వర్షపాతం నమోదైంది.ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలు కాలంలో సాధారణం కన్నా 42 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదయింది. కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 22 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అదే విధంగా రాయలసీమ లో సాధారణం కన్నా 85 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

Tags:    

Similar News