Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరోసారి విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరోసారి విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో వర్షాలకు అనుకూల వాతావరణం నెలకొన్నదని సమాచారం.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది.
భారీ వర్షాల హెచ్చరిక జిల్లాలు
పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే జిల్లాలు
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, కృష్ణా, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.