KC Venugopal: కర్ణాటకలో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలో అమలు చేస్తాం
KC Venugopal: పార్టీ నేతలు గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిక
KC Venugopal: కర్ణాటకలో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలో అమలు చేస్తాం
KC Venugopal: గాంధీ భవన్ లో ఏఐసిసి ఇంచార్జ్ థాక్రే అధ్యక్షతన రాజకీయ వ్యవహారల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శిలు, మాజీ పిసిసి అధ్యక్షులు, పిఏసి సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై చర్చించారు. ఎన్నికల నేపథ్యంలో వ్యవహరించాల్సిన అంశాలు ఎన్నికల కమిటీ, ప్రచారక కమిటీ పని విభజన చర్చించారు. ప్రచార వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం చేరికలపై చర్చించారు. కర్ణాటకలో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలో అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్ తెలిపారు. పార్టీ నేతలు గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.