Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాం
Bhatti Vikramarka: రాహుల్‌గాంధీ దేశానికి గొప్ప నాయకుడు, లౌకికవాది
Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాం
Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని డిక్లరేషన్లను మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నామని, వాటిని అమలు చేస్తామని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్‌పై మేధావులతో అనేక లెక్కలు వేశారని, తరువాతే ఆరు గ్యారెంటీ స్కీములను అధిష్టానం ప్రకటించిందన్నారాయన.... ఇందిరాభవన్‌లో టీపీసీసీ వార్ రూమ్, కనెక్ట్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. విజయభేరి బహిరంగసభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను తాము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలోపు అమలు చేస్తామని చెప్పారు.
ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ నేతలు గ్యారంటీ కార్డు ఇస్తారని, వీటిని పడేయదని, మూడు నెలల పాటు తమ నాయకులు ఇచ్చిన రసీదులను జాగ్రత్తగా కాపాడుకోవాలని విక్రమార్క సూచించారు. రాహుల్‌గాంధీ దేశానికి గొప్ప నాయకుడు, లౌకికవాది అని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడని విక్రమార్క పొగిడారు. అసుదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఉపయోగపడుతున్నాయన్నారు.