Warangal: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి విషమం

Warangal: హైదరాబాద్‌ నిమ్స్‌లో కొనసాగుతున్న చికిత్స

Update: 2023-02-23 05:30 GMT

Warangal: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి విషమం

Warangal: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో ప్రీతికి చికిత్స కొనసాగుతోంది. మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్‌తో పాటు బ్రెయిన్‌లో సమస్యలు గుర్తించిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సీనియర్‌ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌ ఎంజీఎంలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేశారు. కాకతీయ వైద్యకళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. ప్రీతిని సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తుండడంతో తాళలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు. వేధింపులపై కళాశాల, ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు చర్యలు తీసుకోలేదని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆమె ఆరోగ్యపరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News