CM Revanth Reddy: వరంగల్ జిల్లాకు రెండవ రాజధాని అర్హతలున్నాయి
CM Revanth Reddy: కేసీఆర్ కట్టిన అద్భుతాలు ఏంటో చూపిస్తాం
CM Revanth Reddy: వరంగల్ జిల్లాకు రెండవ రాజధాని అర్హతలున్నాయి
CM Revanth Reddy: తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాజీపేట సమీపంలోని మడికొండ వద్ద ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఎర్రబెల్లి చీడ పురుగులను ఓడించామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ చీడ పీడ విరగడ చేశామన్నారు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. వరంగల్ ప్రాంతంలో టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. వరంగల్‌కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాధ్యత తనదేనని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఇండస్ట్రీయల్ కారిడర్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.