వస్తువుల ధరల్లో కనిపించనున్న మార్పులు

Union Budget: ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలకు రెక్కలు, ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు పెరిగే అవకాశం.

Update: 2022-02-02 02:25 GMT

వస్తువుల ధరల్లో కనిపించనున్న మార్పులు

Union budget: 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 'ఆత్మ నిర్భర్‌ భారత్‌' బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది.

తాజా బడ్జెట్‌తో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫ్రిజ్‌లు, ఏసీల ధరలు పెరిగే అవకాశముంది. ఎల్‌ఈడీ బల్బులు, సర్క్యూట్‌ బోర్డులు, వాటి విడి భాగాలు, సోలార్‌ ఇన్వెర్టర్స్‌, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రానున్నాయి. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్‌ బ్యాటరీ ధరలు మరింత పెరిగే అవకాశముంది. విలువైన రాళ్లు, రత్నాలు ధరలు కూడా పెరుగుతాయి. ఆటో మొబైల్‌ విడి విభాగాల ధరలు పెరగవచ్చు. ముడి సిల్క్‌, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి. ప్లాస్టిక్‌ వస్తువులు, సింథటిక్‌ వస్తుల ధరలు వంటనూనె ధరలు కూడా పెరిగే అవకాశముంది.

దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. ప్లాటినం, పల్లాడియం ధరలు తగ్గే అవకాశముంది. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, యంత్రాల ధరలు తగ్గుతాయి. ఇనుము, ఉక్కు, రాగి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. నైలాన్‌ దుస్తుల ధరలు తగ్గనున్నాయి.

Tags:    

Similar News