తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు...

Weather Report Today: లంబసింగి 5, చింతపల్లిలో 6.1, అరకులో 7 డిగ్రీలు సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 6.5...

Update: 2021-12-18 05:43 GMT

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు...

Weather Report Today: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోయాయి. అటు ఏజెన్సీలో సైతం చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలిపులి పంజా విసిరింది. తిర్యాని మండలం గిన్నెదరిలో 8.3 గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సిర్పూర్ (యూ) లో 9 డిగ్రీలు నమోదయింది. ములుగు జిల్లాలోని ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ఏజెన్సీ వాసులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్నంతా మంచు దుప్పటి కప్పేసింది. అటవి పల్లెలు కశ్మీర్‌ను తలపిస్తున్నాయి.

హైదరాబాద్‌ చలి గుప్పిట్లో చిక్కుకుంది. జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మూడు రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది. మూడు రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు చేరుకుంది. మరో నాలుగైదు రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖలో ఏజెన్సీలో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. లంబసింగి 5, చింతపల్లిలో 6.1, అరకులో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 6.5 డిగ్రీలు, జహీరాబాద్ సత్వార్ లో 7.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో 7.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 7.4, రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడెం కాసులాబాద్‌లో 8.2 డిగ్రీలు నమోదైంది.

సంగారెడ్డి జిల్లా గుమ్మడి దల నల్లవల్లిలో 8.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో హెచ్ సీయూ దగ్గర 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, కొమురం భీం, సంగారెడ్డి జిల్లాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags:    

Similar News