Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేత

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపి వేశారు.

Update: 2025-11-12 07:32 GMT

Vemulawada: వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేత

Vemulawada: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపి వేశారు. ఆలయ ప్రధాన గేటు తాళం వేసి రక్షణ కోసం రేకులు ఏర్పాటు చేశారు. అక్కడే రథంపై భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. సుప్రభాత సేవను ఆలయ అర్చకులు నిలిపి వేశారు. ఆలయ విస్తరణ అభిృద్ధిలో భాగంగా ఇప్పటికే భీమేశ్వరాలయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. మరో వైపు ముందస్తు సమాచారం లేకుండా రాజన్న దర్శనం నిలిపివేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని.. ఆలయం మూసివేస్తే ప్రత్యక్షంగా..పరోక్షంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతాయని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఆలయంలోని దర్గాను తొలగించిన తర్వాతే దేవతా మూర్తుల విగ్రహలను ముట్టుకోవాలన్నారు. స్వామివారి దర్శనం విషయంలో భక్తులకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన ఆవశ్యకత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. 

Tags:    

Similar News