TS News: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో నలుగురు యువకులు హల్ చల్ చేశారు. తాగిన మైకంలో ఇద్దరు భక్తులను చావబాదారు. మత్తుబాబుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోయాడు. మరోకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంచిర్యాల జిల్లా జెండా వెంకటాపురం గ్రామానికి చెందిన బావబామ్మర్దులు శంకర్, రాజేందర్ లు వేములవాడు రాజన్న దర్శనానికి వెళ్లారు.
నాగదోషం పూజ చేసుకుని రాత్రి తిరిగి వెళ్తుండగా నలుగురు యువకులు మద్యం మత్తులో భగవంతరావునగర్ వద్ద వీరిని అడ్డుకున్నారు. దొంగలుగా భావించిన ఇద్దర్నీ కొట్టారు. బట్టలు ఊడదీసి చావబాదడంతో రాజేందర్ స్ప్రుహ తప్పి పడిపోయాడు. శంకర్ లేవలేని స్థితికి చేరుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాజేందర్ చికిత్స పొందుతూ మరణించాడు.
నాగదోషం పూజ కోసం వచ్చిన వీరిద్దరూ పూజ తర్వాత మద్యం సేవించారు. మత్తులో ఉన్న ఇద్దరు రాత్రి స్వగ్రామానికి బయలుదేరగా అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానిక యువకులు వారు అప్పటికే మద్య మత్తులో ఉన్నారు. వీరిపై దాడికి పాల్పడ్డారు. వీరిద్దరు అడ్రస్ సరిగ్గా చెప్పలేకపోవడంతో మైకంలో ఉన్న నలుగురు యవకులు తమ ప్రతాపం చూపించారు. వారిద్దర్నీ చావబాదుతూ పైశాచిక ఆనందం పొందారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగింది. చివరకు రాజేందర్ ప్రాణాలు కోల్పోయాడు. దాడి, హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్ను యువకుల కోసం గాలిస్తున్నారు. అయితే వీరిపై దాడి చేసింది గంజాయి బ్యాచ్ గా పోలీసులు భావిస్తున్నారు. నిత్యం మత్తులో జోగుతూ రాత్రిపూట తిరిగే వారిపై దాడులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.