Vemula Veeresham: బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం..?
Vemula Veeresham: భవిష్యత్‌లో ఎమ్మెల్సీతో పాటు మంచి అవకాశం ఉంటుందని భరోసా
Vemula Veeresham: బీఆర్ఎస్ కు గుడ్ బై.. కాంగ్రెస్ లోకి వేముల వీరేశం..?
Vemula Veeresham: బీఆర్‌ఎస్ జాబితాలో చోటుదక్కనివారంతా వరుసగా అసంతృప్తిని వెలగక్కుతున్నారు. పక్క పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..? ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. వేముల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం..? జరుగుతోంది. దీంతో.. రేపు ముఖ్య కార్యకర్తలతో నకిరేకల్‌లో సమావేశం కానున్నారు వీరేశం. భేటీ అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే వేములకు బీఆర్‌ఎస్ ముఖ్యనేతల నుంచి బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. భవిష్యత్‌లో ఎమ్మెల్సీతో పాటు మంచి అవకాశం ఉంటుందని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు.