Bhiknoor: నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలు సీజ్

Update: 2020-04-23 17:09 GMT

భిక్కనూరు: మండలంలో ఈ రోజు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వాహనదారులు రోడ్డుపైకి వచ్చినందుకు 14 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు, లాక్ డౌన్ ముగిసిన తర్వాత కోర్టు ద్వారా తమ ద్విచక్ర వాహనాలను కోర్టు విధించిన జరిమానాలు చెల్లించి వాహనాలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్ఐ తెలిపారు. అలాగే మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా తెరచి ఉంచిన బార్బర్ షాపు యజమాని పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.


Tags:    

Similar News