V Hanumantha Rao: శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు

V Hanumantha Rao: నీకు, నీ భార్యకు సీట్లు కావాలి, మా సీట్లు మాకు వద్దా

Update: 2023-10-22 12:45 GMT

V Hanumantha Rao: శ్రీకాంత్ లాంటి వ్యక్తిని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు

V Hanumantha Rao: అంబర్‌పేట్ సీటుపై కాంగ్రెస్‌లో గలాటా నడుస్తోంది. అంబర్ పేట్ స్థాన్నాన్ని నూతి శ్రీకాంత్ గౌడ్‌కు ఇప్పించేందుకు.. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తెర వెనక పావులు కదుపుతున్నారని వీహెచ్‌ ఫైర్ అయ్యారు. ఉత్తమ్ నా అంబర్ పేట్ సీట్ వెంట పడ్డారని ఆయన విమర్శించారు. శ్రీకాంత్ అనే వ్యక్తి గతంలో తనపై sc, st అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టారని, లాంటి వ్యక్తిని ఉత్తమ్ ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. తాను కాంగ్రెస్ లాయలిస్టునని,, ఉత్తమే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని,, వాటిని బయట పెడతానన్నారు వీహెచ్. నీకు, నీ భార్యకు సీట్లు కావాలి, మా సీట్లు మాకు వద్దా అంటూ ఉత్తమ్‌ను ప్రశ్నించారు. అంబర్‌పేట సీటు నాది.. నాకు దక్కకుండా చేస్తే.. నేను కూడా ఉత్తమ్ వెంట పడుతానని హెచ్చరించారు వీహెచ్.

Tags:    

Similar News