Uttam Kumar Reddy: డిసెంబర్‌ నాటికి నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు

Uttam Kumar Reddy: నీటిపారుదల శాఖపై ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమీక్ష కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చ

Update: 2024-01-13 12:41 GMT

Bhatti Vikramarka: డిసెంబర్‌ నాటికి నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు

Uttam Kumar Reddy: జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలపై చర్చించారు. జూన్‌ నాటికి కొత్తగా 50 వేలు, డిసెంబర్‌ నాటికి నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నీటిపారుదల శాఖలో గత పాలకులు అప్పులు ఎక్కువ చేశారని.. అయినా అందుకు తగిన ప్రతిఫలం రాలేదన్నారు. అందుకే అవసరం మేరకు ఖర్చులు చేయాలన్నారు. కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభమైనట్లు చెప్పారు.

అవసరమైన నిధులు ఖర్చు చేసి కొత్త ఆయకట్టు సృష్టించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ప్రాజెక్టులలో నీరందించే విషయంలో అడ్డంకులను తొలగించాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో సుమారు 18 ప్రాజెక్టులలో పలు ప్యాకేజీల కింద ఈ ఏడాది చివరి నాటికి నీరు అందిస్తామన్నారు. రానున్నది వేసవి కాలం కాబట్టి రాష్ట్రంలో చెరువుల పూడిక కార్యక్రమాలు, జంగిల్ కటింగ్ చేపట్టాలని అధికారులకు ఉత్తమ్ సూచించారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు కోయినా ప్రాజెక్టు నుంచి 100 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ఖర్చును మహారాష్ట్రకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. కర్ణాటక నుండి 10 TMC కృష్ణా నీటిని విడుదల చేయాలని కోరుతున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Tags:    

Similar News