BRS: చెన్నూరులో బీఆర్ఎస్ నేతల అరెస్టు..

చెన్నూర్‌లో బీఆర్ఎస్ నేతల అరెస్టులు. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అదుపులోకి. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల అల్లర్ల కేసుల నేపథ్యం.

Update: 2026-02-18 09:27 GMT

BRS: చెన్నూరులో బీఆర్ఎస్ నేతల అరెస్టు.. 

మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఆయనను రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నికల సందర్భంగా నిన్న చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ఘటనలకు సంబంధించి నమోదైన కేసులో A2 నిందితుడిగా ఉన్న మూల రాజిరెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్ల కేసులకు సంబంధించి మరికొంతమంది నేతలను కూడా పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నట్లు సమాచారం. అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News