Hyderabad: మరో పెళ్లి చేసుకుందని మాజీ భార్యపై పగ: పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి చొరబడి...
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు.
Hyderabad: మరో పెళ్లి చేసుకుందని మాజీ భార్యపై పగ: పెట్రోల్ డబ్బాతో ఇంట్లోకి చొరబడి...
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. విడాకులు ఇచ్చిందన్న కోపంతో మాజీ భార్యను ఓ వ్యక్తి హత్య చేశాడు. వనస్థలిపురంలోని గ్రీన్‌సిటీ కాలనీలో ఉంటున్న సునీతకు గతంలో మహేశ్‌తో వివాహమైంది. ఇరువురి మధ్య మనస్పర్థలు రావడంతో సునీత ఏడాది క్రితమే అతడికి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంది. దీంతో కోపం పెంచుకున్న మహేశ్.. ఆమె ఇంట్లోకి కత్తులు, పెట్రోల్ డబ్బాతో చొరబడి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.