Uttam Kumar: ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా
Uttam Kumar: ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు
Uttam Kumar: ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా
Uttam Kumar: సీడబ్ల్యూసీ రెండు రోజుల సమావేశాలు పలఫ్రదంగా జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్..తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం నింపిందన్నారు. కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు. హామీలు నెరవేర్చని కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని విమర్శించారు. దలితులకు మూడు ఎకరాల భూమి, మైనారిటీలకు 12శాతం రిజిస్ట్రేషన్లు ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీని నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.