అస్తవ్యస్తంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు
మండల పరిధిలోని రొంపి మల్ల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని సిపిఎం నాయకులు పేర్కొన్నారు.
మధిర: మండల పరిధిలోని రొంపి మల్ల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం ఆధ్వర్యంలో వాటిని పరిశీలన చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం బృందం జిల్లా నాయకులు మండవ కృష్ణారావు, గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్, సంగం మండల కార్యదర్శి ఓట్ల శంకర్ రావు, అధ్యక్షులు మదార్, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సైదులు, ప్రభాకర్ తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సరైన కొలతల ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించలేదని, ఇండ్లపై కనీసం వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయలేదని, కిచెన్ లో, బాత్రూం లో వాటర్ పైప్ కలెక్షన్ ఇవ్వలేదని, కనీసం కరెంటు మీటర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. తక్షణమే అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు అయిన వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు.