కిలాడీ లేడీ శిల్పాచౌదరికి చుక్కెదురు.. 14 రోజుల రిమాండ్‌ విధింపు

చంచల్‌గూడ జైలుకు శిల్పా తరలింపు కిట్టీపార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టినట్టు శిల్పాపై ఆరోపణలు

Update: 2021-12-16 04:45 GMT

శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్‌ విధింపు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Shilpa Chowdary: పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలాడీ లేడీ శిల్పా చౌదరికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. శిల్పా చౌదరి బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణను వాయిదా వేసింది. అనంతరం శిల్పా చౌదరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసుల కస్టడీ విచారణలో మాత్రం శిల్పా నోరు మెదపలేదట. పోలీసుల బ్రెయిన్‌ను ముందే చదివినట్లు.. వాళ్ళు ఏమడిగినా దానికి తగ్గట్లే సమాధానం ఇచ్చేదట. దీంతో విచారణలో ఒక్క ముక్క వివరాలు రాబట్టలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారని టాక్.

రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు, కిట్టీ పార్టీల పేరుతో కోట్ల రూపాయల డబ్బు అప్పుగా తీసుకుని ఎగవేసిననట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్ప చౌదరి విచారణ పోలీసులకు సవాల్ గా మారింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పీఎస్‌లో ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి. 7 కోట్లు తీసుకొని ఆమె పలువురిని మోసం చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అప్పుగా తీసుకున్న డబ్బంతా ఎక్కడికి మళ్లించారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువని, తనకేమీ తెలియదని, ఆరోపణలన్నీ అవాస్తవమని శిల్ప చెబుతోంది. ఇక.. శిల్ప చౌదరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. తాను డబ్బు ఎవరి దగ్గర నుంచి తీసుకుంది. ఆర్థిక లావాదేవీలు ఎవరితో నడిపిందనే విషయాలను.. శిల్ప కాల్ డాటా లిస్ట్ ఆధారంగా తెలుసుకున్నారు. అయితే విచారణలో శిల్ప తనకే చాలా మంది డబ్బు ఇవ్వాల్సి ఉందని పోలీసులను డైవర్ట్ చేసే ప్రయత్నం‌ చేసిందట. శిల్ప ఆర్థిక లావాదేవీలను మధ్యవర్తుల ద్వారా నడిపిన వ్యక్తులను సైతం పోలీసులు విచారించారు. బడా బాబుల భార్యలు, చెల్లెల్లను నమ్మించి వారి వద్ద తీసుకున్న డబ్బంతా ఇప్పుడు ఎక్కడ పెట్టారో అంతుచిక్కని ప్రశ్నలా మారింది.

శిల్ప ఆమె భర్త శ్రీనివాస్ ఇద్దరూ కలిసి చాలామంది బడా షాల్తీలను కిట్టీ పార్టీలు, బిజినెస్ పెట్టుబడులంటూ మోసం చేశారని బాధితులు బోరుమంటున్నారు. కొంతమందైతే ఫిర్యాదు చేయకుండానే పోలీసులను కలిసి డబ్బు ఇప్పించాలంటూ కోరుతున్నట్లు తెలుస్తోంది. శిల్ప బ్యాంక్ అకౌంట్లు, బ్యాంకు లాకర్లు, ఇంటిని తనిఖీలు చేసిన పోలీసులకు ఏమీ లభించలేదు. శిల్ప ఉన్న నగలన్నీ తనాఖాలో ఉన్నాయి. బ్యాంకు లాకర్లలో‌ బంగారం లేదు. అకౌంట్లలో డబ్బూ లేదు. మరి బాధితుల దగ్గర తీసుకున్న కోట్ల రూపాయల డబ్బంతా ఎక్కడ పెట్టిందనేది పోలీసులకు సవాల్ గా మారింది. ఇదిలా ఉంటే.. శిల్ప విచారణలో పోలీసులకు చుక్కలు చూపిస్తోందట. ఎక్కువ ప్రశ్నలు అడిగితే మైగ్రేన్‌ ఉంది.. తలనొప్పి వస్తోందని పెదవి విప్పట్లేదట. తనకు ఆకలేస్తే మాత్రం బిర్యాని కావాలని‌ డిమాండ్ చేస్తోందని టాక్‌ వినిపిస్తోంది. 

Tags:    

Similar News