రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. నడి రోడ్డుపై అప్పుడే పుట్టిన పసికందు

Rajanna Sircilla: దీపావళి రోజున జన్మించి అనాథగా మారిన శిశువు...

Update: 2021-11-04 07:45 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం.. నడి రోడ్డుపై అప్పుడే పుట్టిన పసికందు

Rajanna Sircilla: కన్నతల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందు చలిలో వణుకుతోంది. అమ్మ పాలు తాగాల్సిన శిశువు.. నడిరోడ్డుపై గుక్కపట్టి ఏడుస్తోంది. ఏ తల్లీ కన్నదో తెలియదు. ఎవరు వదిలి వెళ్లారో తెలియదు. నడిరోడ్డుపై అప్పుడే పుట్టిన పసికందు గుక్కపట్టి ఏడుస్తోంది. ఈ దారుణం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం కేంద్రంలో చోటుచేసుకుంది.

ఆడపిల్ల పుట్టిందని అనుకున్నారో.. లేదంటే వేరే కారణాలు ఉన్నాయో తెలియదు కానీ స్థానిక పోలీస్ స్టేషన్‌ పక్కనే అప్పుడే పుట్టిన పసికందును వదిలి వెళ్లారు. చలిలో వణుకుతూ ఏడస్తున్న ఆ పాపను పోలీసులు గమనించి అక్కున చేర్చుకున్నారు. వెంటనే పోతుగల్‌ ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తగిన వైద్యం అందించారు. పాపం ఆ చిన్నారి దీపావళి రోజున జన్మించిన అనాథగా మిగిలిపోయింది.

Tags:    

Similar News