Mahendra Nath Pandey: తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది
Mahendra Nath Pandey: సూర్యాపేటలో కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పర్యటన
Mahendra Nath Pandey: తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది
Mahendra Nath Pandey: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ ఆరోపించారు. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్‌చార్జిల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడీ రాక ముందు ఆరు రాష్ట్రాల్లో బీజేపీ పాలించేదని.. ఇప్పుడు 18 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పెద్ద అవినీతిపరుడని.. 1,150 కోట్ల ధాన్యం కొనుగోలు విషయంలో అవినీతి చేశాడని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. ఈ అవినీతిపరులకు చరమగీతం పడతామని తెలిపారు.