Union Minister Kishan Reddy : రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి : కేంద్రమంత్రి కిషన్ ‌రెడ్డి

Update: 2020-09-05 12:28 GMT

 Union Minister Kishan Reddy File Photo   

Union Minister Kishan Reddy : హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ప్రధాన మంత్రి అవాస్ యోజన, పీఎంస్వపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ,బ్యాంకర్స్ తో సమీక్ష నిర్వహించామని కేంద్ర హోం శాఖ సహాయ శాఖ కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వీధి వ్యాపారులందరూ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడగించామని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయన అన్నారు. రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదని స్పష్టం చేసారు. కేంద్ర నిధులను సైతం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికే వెచ్చిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు రకాల వడ్డీ రాయితీలు కల్పిస్తుందన్నారు. హైదరాబాద్లో సొంత స్థలం ఉన్న వాళ్లఅందరికి సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కేంద్రం వెల్ నెస్ కేంద్రాలను, కేంద్ర ప్రభుత్వం బస్తీ దావాఖానాల నిర్వహహణ కు నిధులు ఇస్తుందని తెలిపారు.

బస్తీ దవాఖానాలు సమర్ధవంతంగా పని చేయాలని కోరారు. 168 బస్తీ దవాఖానాలను కేంద్రం హైదరాబాద్ నగరానికి మంజూరు చేసిందని స్పష్టం చేసారు. వీటి పూర్తి నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని ఆయన అన్నారు. ఈసారి పత్తి ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణలో మూడు కేంద్రాలుగా సీసీఐ పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో కేంద్రాలు ఉన్నాయన్నారు. గతాడేది 258 జిన్నింగ్ మిల్స్ లో కాటన్ ను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఎక్కువ జిన్నింగ్ మిల్స్ లో కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మధ్య దళారులు, వ్యాపారులు నుంచి పత్తి కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాటన్ కొనుగోలు కేంద్రాలు, తేమ శాతంపై రైతులను చైతన్యం కల్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ఈ నెల చివరిలో కొనుగోలు కేంద్రాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా రైతాంగానికి మేలు చేసే చర్యలు కేంద్రం తీసుకుంటుందని పేర్కొన్నారు. కోటి నలభై మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉండి రాష్ట్రాలకు ఇవ్వకపోతే నిష్టుర్చొచ్చుని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పెడరల్ వ్యవస్థలో కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని కోరారు.

Tags:    

Similar News