పధకం ప్రకారమే సికింద్రాబాద్ అల్లర్లు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Kishan Reddy: సికింద్రాబాద్ ఘటనను ఖండించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy: అగ్నిపథ్ పథకంపై అవాస్తవాలను ప్రచారం.. తెలంగాణ పోలీసులు ప్రేక్షక పాత్ర..
Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. యువతను తప్పుదోవ పట్టించే విధంగా కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అగ్నిపథ్ పథకంపై అవాస్తవాలను ప్రచారం చేసి ముందస్తు ప్రణాళిక ప్రకారం విధ్వంసం సృష్టించారని అన్నారు. అగ్నిపథ్ పథకాలు ఇతర దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయన్నారు. ఇజ్రాయిల్, బ్రెజిల్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మెక్సికో, ఇరాన్ లలో తప్పనిసరి సైనిక శిక్షణ అమలులో ఉందన్నారు.
మనదేశంలో అగ్నిపథ్ తప్పనిసరి సైనిక శిక్షణ పథకం కాదని ఇష్టం ఉన్న వాళ్లు మాత్రమే ఇందులో చేరవచ్చు అన్నారు. అగ్నిపథ్ పథకంలో సర్వీసు పూర్తి చేసుకుని బయటకు వచ్చే వారికి ఉద్యోగ, ఉపాధి కల్పన కలిపించే విధంగా ఈ పథకాన్ని తీర్చి దిద్దారని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం జరుగుతుంటే తెలంగాణ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని కేంద్రమంత్రి ఆరోపించారు.