Kishan Reddy: కేసీఆర్ ఎన్నికుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం
Kishan Reddy: కేసీఆర్ కుటుంబ సభ్యుల అవినీతికే మీటర్లు పెట్టేందుకు.. మునుగోడు నుంచే ప్రజలు సన్నద్ధం అవుతున్నారు
Kishan Reddy: కేసీఆర్ ఎన్నికుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం
Kishan Reddy: సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అవినీతి కూపంలో మునిగిపోయిన కేసీఆర్ కుటుంబ సభ్యులకు మునుగోడు నుంచే ప్రజలు మీటర్ పెడతారని చురకలంటించారు. డబ్బులు సంచులు దించి ప్రలోభపెట్టినా కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మంత్రులు, ఆయన బలగాన్నంతా దింపినా హుజురాబాద్, దుబ్బాక ఫలితాలే రిపీటవుతాయన్నారు.