ఒకరిపై ఒకరు విరుచుకపడిన కిషన్ రెడ్డి, కేటీఆర్

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఒకరి ప్రభుత్వంపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. హైదరాబాద్‌లో వరదలు బీభీత్సం సృష్టిస్తే.. సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారని కిషన్‌ రెడ్డి ఎద్దెవా చేశారు

Update: 2020-11-08 15:14 GMT

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఒకరి ప్రభుత్వంపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. హైదరాబాద్‌లో వరదలు బీభీత్సం సృష్టిస్తే.. సీఎం కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉన్నారని కిషన్‌ రెడ్డి ఎద్దెవా చేశారు.. 10 వేల వరదసాయం కూడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల జేబుల్లోకి పోతున్నాయని ఆరోపించారు. నగర అభివృద్ధికి కేటాయించిన 67 కోట్లు ఏం చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తండ్రీ కొడుకుల ప్రభుత్వాన్ని తరిమికొడతామన్నారు కిషన్ రెడ్డి...

అయితే దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పర్యవేక్షణ వల్లే వరద బాధితులను రక్షించాగలిగమన్నారు. వరద సాయంపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వరద సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చురకలు అంటించారాయన. ఇక్కడున్న తెలంగాణ బీజేపీ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకొచ్చారా..? అంటూ మండిపడ్డారు. మొత్తానికి ఈ ఇద్దరు మంత్రులు ఒకరి మాటలు సంధించుకున్నారు. 


Full View


Full View


Tags:    

Similar News