Bandi Sanjay: రాష్ట్రంలో తుపాకులతో కోట్ల రూపాయల దందా చేస్తుంటే పోలీసులు పట్టించుకోరా..?
Union Minister Bandi Sanjay Slams Telangana Govt Over Attack on Go Rakshak Questions Police Inaction
Bandi Sanjay: రాష్ట్రంలో తుపాకులతో కోట్ల రూపాయల దందా చేస్తుంటే పోలీసులు పట్టించుకోరా..?
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిన్న యమ్నంపేటలో గో రక్షకుడిపై జరిపిన కాల్పుల ఘటనపై తీవ్రంగా స్పందించారు. తుపాకులతో దందాలు చేస్తుంటే.. రాష్ట్రంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం చేయలేని పనులను గోరక్షకులు చేస్తున్నారన్నారు.
గోవులను అక్రమంగా తరలించే వారిని ప్రభుత్వం పట్టుకోక పోతే తమ వాళ్ళు పట్టుకుంటానికి రెడీ అయ్యారని తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దన్నారు. పోలీసుల చేతకానితనం వల్లే రివాల్వర్ వాడుతూ దందాలు చేస్తున్నారన్నారు. హిందూవుల మనోభావాలు దెబ్బతినెలా పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.