TS High Court: TSPSCపై హైకోర్టు ఆగ్రహం.. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
TS High Court: గ్రూప్-1 రీపరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటి
TS High Court: TSPSCపై హైకోర్టు ఆగ్రహం.. ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
TS High Court: TSPSCపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఫైర్ అయింది. రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే TSPSC విఫలమవుతుందని హైకోర్టు విమర్శించింది. మొదటిసారి పేపర్ లీకేజ్ తో పరీక్ష రద్దు చేశారు. రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని హైకోర్టు న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. గ్రూప్-1 రీ పరీక్షలో బయోమెట్రిక్ పెట్టకపోవడానికి కారణాలేంటి హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్-1 ఎగ్జామ్‌ను రద్దు చేస్తూ..హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడంతో.. టీఎస్‌పీఎస్సీ బోర్డు.. డివిజన్ బెంచ్‌కు వెళ్లగా.. ఈ మేరకు హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.