Wanaparthy: వనపర్తి నెమళ్లు.. అడవికి చేరిన రెండూ, ఒకటి కోల్పోయాం
వనపర్తి జిల్లా, ఖిల్లా ఘనపూర్ రేంజ్ పరిధిలోని గోపాలపేట మండలం అటవీ ప్రాంతంలో ఈ నెల 10వ తేదీన మూడు జాతీయ పక్షులు (నెమళ్లు) అస్వస్థతతో కనిపించాయి.

ఈ విషయాన్ని గుర్తించిన అటవీ అధికారులు, ఆ మూడు నెమళ్లను వనపర్తి డివిజన్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం వనపర్తికి తరలించారు. అక్కడ వనపర్తి డివిజన్ పశువైద్యుడు ఆ నెమళ్లకు చికిత్స అందించారు. చికిత్స అనంతరం వాటిని డివిజన్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక గదిలో ఉంచి సంరక్షించారు.
తాజా పరిస్థితి:
చికిత్స పొందిన మూడు నెమళ్లలో రెండు పూర్తిగా కోలుకోగా, ఒక నెమలి మరణించింది.
కోలుకున్న ఆ రెండు జాతీయ పక్షులను అడవిలో విడుదల చేసినట్లు ఖిల్లా ఘనపూర్ రేంజ్ ఆఫీసర్ మంజుల తెలిపారు.