హైదరాబాద్‌లో దారుణం.. బతికున్న శిశువును పూడ్చిపెట్టేందుకు యత్నం

Update: 2019-10-31 09:13 GMT

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బతికున్న శిశువును పూడ్చిపెట్టేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నించారు. దీనిని చూసిన ఆటో డ్రైవర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనవరాలు చనిపోవడంతో పూడ్చి పెడుతున్నామని దుండగులు బుకాయించారు. అయితే వారి మాటలపై నమ్మకం కలగని పోలీసులు శిశువును చూడగా చిన్నారి ప్రాణాలతోనే ఉంది. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆడపిల్ల పుట్టడంతోనే వారు ఈ చర్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News