Road Accident: మొయినాబాద్‌లో రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి

Road Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ నేషనల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి.

Update: 2025-11-21 05:32 GMT

Road Accident: మొయినాబాద్‌లో రెండు కార్లు ఢీ.. ఇద్దరు మృతి

Road Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్-బీజాపూర్ నేషనల్ హైవేపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతిచెందగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరో వ్యక్తి మృతిచెందాడు. మరో ఏడుగురికి తీవ్రగాయాలు గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మొయినాబాద్‌లోని ఒక రిసార్ట్‌కి ఫొటో షూట్‌కి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఇదే హైవేపై కొన్ని రోజుల క్రితం టిప్పర్- ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరువకముందే నిన్న మరో టిప్పర్ చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇలా ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News