GHMC చివరి కౌన్సిల్ సమావేశం: రూ. 11,460 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం!
GHMC Council Last Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన కొనసాగుతోంది.
GHMC Council Last Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన కొనసాగుతోంది. ఫిబ్రవరి10తో ప్రస్తుత కౌన్సిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇదే చివరి సమావేశం కొనసాగుతుంది. ఇందులో 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన 11 వేల 460 కోట్ల బడ్జెట్‌పై చర్చించి ఆమోదం తెలపనున్నారు. దీంతో కౌన్సిల్ ఆరోసారి బడ్జెట్‌కి ఆమోదం తెలిపినట్టవుతుంది.
వాస్తవానికి ఐదేండ్ల పాటు ఉండే కాలపరిమితిలో ఐదు సార్లు మాత్రమే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఈ కౌన్సిల్‌కి పలు కారణాల వల్ల ఆరోసారి కూడా అవకాశం వచ్చింది. వీటితో పాటు మరిన్ని అంశాలపై చర్చించి ఆమోదించనున్నారు.