మలక్‌పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్.. అక్క కోసమే..
Crime News: మలక్ పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్య శిరీషను భర్త వినయ్ చంపినట్టుగా వెలుగు చూసింది.
మలక్‌పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్.. అక్క కోసమే..
Crime News: మలక్ పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. అక్క కోసమే భార్య శిరీషను భర్త వినయ్ చంపినట్టుగా వెలుగు చూసింది. అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందని శిరీషను హత్య చేశాడు. మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేశాడు. గుండెపోటుతో చనిపోయిందని శిరిష మేనమామకు సమాచారం అందించాడు.
మృత దేహాన్ని అక్కడే ఉంచాలని మేనమామ చెప్పినా అప్పటికే డెడ్ బాడీని తరలించారు. సీసీ కెమమెరాల ద్వారా అంబులెన్స్ ను ట్రేస్ చేసి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి మృత దేహాన్ని దోమలపెంట దగ్గర పట్టుకున్నారు. పోస్ట్ మార్టం నివేదికలో శిరీషను హత్య చేసినట్టు నిర్దీరించారు. వినయ్ తోపాటు సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.