TSRTC Courier Parcel Charges: పార్శిల్, కొరియర్ ఛార్జీలను తగ్గించిన ఆర్టీసీ

TSRTC Courier Parcel Charges: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2020-07-22 06:27 GMT

TSRTC Courier Parcel Charges: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. పార్శిల్ సేవల, కొరియర్ ఛార్జీలను తగ్గించింది. జూలై 22 నుంచి తగ్గించిన పార్సిల్ చార్జీలను అమలులోకి తీసుకురునున్నారు. ఈ చార్జీలు తగ్గించక ముందు పది కిలోల కన్నా తక్కువ బరువున్న కొరియర్ లేదా పార్శిల్ కోసం టీఎస్ఆర్టీసీ గతంలో ఒకే ఛార్జీలను వసూలు చేశారు. కానీ ఇప్పుడు తగ్గించన చార్జీల కారణంగా ఆరు నుంచి పది కిలోల లోపు బరువు ఉన్న పార్శిల్‌కు, అదే విధంగా ఐదు కిలోల లోపు బరువు ఉన్న ఛార్జీలను ఈరోజు నుంచి వేర్వేరుగా వసూలు చేయనున్నారు. పది కిలోల కంటే తక్కువ బరువు ఉన్న పార్శిల్‌ను 75 కిలోమీటర్ల లోపు దూరం తీసుకెళ్లడానికి గతంలో రూ.50 వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం ధరలు తగ్గించడంతో పార్శిల్ బరువు ఆరు నుంచి 10 కిలోల మధ్య బరువు ఉంటే.. దానికి రూ.50, ఐదు కిలోల లోపు ఉంటే.. రూ.20 వసూలు చేయనున్నారు. ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది.

ఇక అదే విధంగా ఇంటర్ స్టేట్ కొరియర్, ఇంట్రా సర్వీసుల ఛార్జీలను కూడా తగ్గించింది. గతంలో ఇంట్రా స్టేట్ కొరియర్ 250 గ్రాముల కన్నా తక్కువ బరువుంటే రూ.50 వసూలు చేసేవారు. అదే పార్శిల్ ఇతర రాష్ట్రాలకు తీసుకెళితే రూ.75 వసూలు చేసేవారు. కానీ ప్రస్తుతం తగ్గించిన చార్జీల ప్రకారం ఇంట్రా స్టేట్ కోరియర్ చార్జీలు 250 గ్రాముల కన్నా తక్కువ బరువుంటే రూ.20, ఇతర రాష్ట్రాలకు అయితే రూ.40 వసూలు చేయనున్నారు. ఇక టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకోవడంతో కొరియర్, పార్శిల్ సర్వీసుల్లో మరింతగా ఆదాయం సమకూరనుంది.

Tags:    

Similar News