యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ

Yadadri Darshini: ఉప్పల్ నుంచి యాదాద్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Update: 2022-03-30 16:00 GMT

యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ 

Yadadri Darshini: యాదాద్రి భక్తలుకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గుట్టప్రయాణికుల కోసం అన్నిజిల్లా కేంద్రాల నుంచి ఉప్పల‌్ సర్కిల్ కు అక్కడి నుంచి గుట్టకు రెండు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇందుకోసం 100 మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అన్ని వర్గాలకు అనుకూలమైన ఛార్జీలు నిర్ణయించింది.

దివ్యక్షేత్రం యాదాద్రికి ప్రజారవాణాను మెరుగు పరిచేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఆలయ సర్వదర్శనాలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల యాదాద్రి సర్వదర్శనాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు సిద్దమైంది. ఇందుకోసం రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ సర్వీసులతో ప్రత్యేక మినీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ సర్వీసులలో ఒకటి ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్‌కు, అక్కడి నుంచి యాదగిరిగుట్టకు మినీ బస్సులు నడుపుతున్నారు.

తెలంగాణ తిరుపతి దివ్యక్షేత్రం యాదాద్రికి ప్రత్యేక సర్వీసులలో తొలివిడతా ఉప్పల్ నుంచి 104 మినీ బస్ సర్వీసులను ఆర్టీసీ ఛైర్మన్ భాజిరెడ్డితో కలిసి సజ్జనార్ లాంఛనంగా ప్రాంరభించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్‌ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు నడపుతున్నట్లు తెలిపారు. తొలి విడతగా ఉప్పల‌్ నుంచి 104 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఇక ఈసర్వీలులో జేబీఎస్‌ నుంచి రూ.100, ఉప్పల్‌ నుంచి రూ.75గా టికెట్‌ ధరను నిర్ణయించామ సజ్జనార్ వెల్లడించారు. భక్తులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

యాదాద్రి భక్తులకు ఆర్టీసీ నిజంగా శుభవార్త చెప్పిందనే అనుకోవచ్చు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్న ఎండీగా సజ్జనార్ ఈకార్యక్రమంలో ఆవిషయంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

Tags:    

Similar News