TSRTC: జనవరి 5 నుంచి సమ్మెకు వెళ్తాం.. ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యం
TSRTC: పరిమితికి మించి ఎక్కడంతో మైలేజ్ రావడం లేదని ఆందోళన
TSRTC: జనవరి 5 నుంచి సమ్మెకు వెళ్తాం.. ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యం
TSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. అయితే ఈసారి సమ్మె చేస్తోంది కార్మికులు కాదు. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఎల్లుండి నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సర్కార్ కు ఆల్టిమేటం జారీ చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని వారు తెలిపారు. రద్దీ పెరిగి బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతుండడంతో తమ బస్సులు దెబ్బతింటున్నాయని ప్రైవేటు బస్సుల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. బస్సుల్లో పెరిగిన రద్దీతో తమ బస్సుల నాణ్యత తగ్గిపోతుందని వాపోతున్నారు. బస్సులు త్వరగా పాడవుతాయని.. రద్దీ వల్ల ప్రమాదాలు జరిగే అస్కారం కూడా ఉందని అంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని. లేదంటే ఈనెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకవేళ ఆర్టీసీ అద్దె యజమానులు సమ్మెకు వెళ్తే మహాలక్ష్మీ పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.