TSRTC Employees in Grip of Fear Over Coronavirus: ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కలవరం

Update: 2020-08-04 09:25 GMT

TSRTC Employees in Grip of Fear Over Coronavirus: ఆర్టీసీ ఉద్యోగులను కరోనా కలవరపెడుతుంది. రోజురోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఉద్యోగలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో 30 మంది ఉద్యోగులు కరోనాతో మరణించారు. మరో 200 మందికి పైగా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హస్పిటల్ లో హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే నగరంలో మినహయించి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభమైనప్పటికి విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు నిత్యం భయం భయంగా బతుకుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగుల్లో కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అధికారులు, సిబ్బందిలో ఎప్పుడు ఎవరు ఎక్కడ వైరస్ భారీనపడుతారో తెలియడం లేదు. ఇప్పటికే 30 మందికిపైగా ఆర్టీసీ సిబ్బందిని పొట్టనపెట్టుకున్న వైరస్ వేగంగ విస్తరిస్తుంది. బస్సు డ్రైవర్లు, కండక్టర్లతో పాటు డీపోల్లో పనిచేసే అధికారులకూ కోవిడ్ సోకుతుంది. లాక్ డౌన్ మినహయింపులతో సర్వీసులు ప్రారంభం కాగానే ఆర్టీలో కరోనా వ్యాప్తి మొదలైంది. నగరంలో పారిశుద్ద్య కార్మికులు, హస్పిటల్, జీహెచ్ఎంసీ సిబ్బంది తరలింపునకు ఆర్టీసీ బస్సులు ఉపయోగిస్తున్నారు. ఇదే క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు కోవిడ్ భారీన పడుతున్నారు.

కరోనా భారీన పడిన ఆర్టీసీ సిబ్బందికి ఆన్ డ్యూటీ ప్రకటించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికులు పాజిటివ్ రావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్నాకలోని ఆర్టీసీ హస్పిటల్ లో ప్రత్యేక కోవిడ్ వార్డును ఏర్పాటు చేయాలని క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ లో ప్రతి ఉద్యోగికి 50 లక్షల భీమా సౌకర్యం కల్పిస్తూ చనిపోయిన ఉద్యోగి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీలో రోజురోజుకు పెరుగుతున్న కేసులపై యాజమాన్యం దృష్టి సారించాల్సిన అవసరముంది. తార్నాక లో ఉన్న హస్పిటల్ లో ప్రత్యేక కొవిడ్ వార్డును ఏర్పాటు చేసి అక్కడ చికిత్స ను ప్రారంబిస్తే ఉద్యోగుల్లో భయం తొలిగేపోయే అవకాశం ఉంది.

Tags:    

Similar News