TSRTC Reduced Parcel Service Prices: ఆదాయం పెంపుపై ఆర్టీసీ ప్రయత్నం.. తెలంగాణాలో తగ్గించిన పార్సిల్ ధరలు

TSRTC Reduced Parcel Service Prices: ఆదాయం పెంపుపై ఆర్టీసీ ప్రయత్నం.. తెలంగాణాలో తగ్గించిన పార్సిల్ ధరలు
x
TSRTC Cargo and Parcel Services
Highlights

TSRTC Reduced Parcel Service Prices: రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాస్త పైకి లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

TSRTC Reduced Parcel Service Prices: రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాస్త పైకి లేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రరూపం దాల్చడం వల్ల ప్రజలు ప్రయాణం చేసే పరిస్థితి ఉండకపోవడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచన చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల ఆర్టీసీకి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న కార్గో సర్వీసులను మరింత పెంచడంతోపాటు బయట వసూలు చేస్తున్న చార్జీల కన్నా తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే చార్జీలను తగ్గించి ముందగుడు వేసిన ఏపీని తెలంగాణా అనుసరించింది. ఇక్కడ కూడా కార్గో చార్జీలు తగ్గించి,రవాణా చేసేందుకు చర్యలు తీసుకున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కార్గో, పార్సిల్ సర్వీస్ విజయవంతం అవుతోంది. ఇటీవలే పీసీసీ ( పార్సిల్‌-కొరియర్‌-కార్గో) సేవలను వినియోగదారుకు మరింత దగ్గర అయ్యేందుకు చార్జీలను తగ్గించినట్టు ప్రకటించింది. తగ్గించిన చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఇప్పటి వరకు 0-10 కిలోల వరకు ఉన్న స్లాబును 0-5 కిలోలకు కుదించింది. 6-10 కిలోలకు మరో స్లాబును ఏర్పాటు చేసింది.

ఇప్పటి వరకు 0 నుంచి 10 కిలోల బరువు ఉన్న పార్సిల్‌ను 75 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 50 ఛార్జీ చేసేవారు. ప్రస్తుతం ఐదు కిలోల లోపు పార్సిల్‌ను 75 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 20 మాత్రమే తీసుకుంటున్నారు. 6 నుంచి 10 కిలోల బరువు ఉన్న పార్సిల్స్‌కు రూ. 50 వసూలు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర రవాణా ఛార్జీలను సైతం తగ్గించింది. గతంలో 250 గ్రాముల పార్సిల్‌ను తరలించేందుకు రూ. 75 వసూలు చేయగా ప్రస్తుతం రూ. 40కి తగ్గించారు. వినూత్న ప్రయోగాలతో ముందుకు వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ అడుగు పెట్టిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories