తెలంగాణలో ఆగని ఇంటర్‌ విద్యార్థుల ఆందోళన.. ధర్నాలతో సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి

TS Inter Students Protest: విద్యార్థులను పాస్‌ చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ...

Update: 2021-12-22 03:32 GMT

తెలంగాణలో ఆగని ఇంటర్‌ విద్యార్థుల ఆందోళన.. ధర్నాలతో సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి

TS Inter Students Protest: తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల తరపున ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో చాలా మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడంతో.. ఇంటర్‌ బోర్డు ఎదుట విద్యార్థి సంఘాలు నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. విద్యార్థి సంఘాల నినాదాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో పడింది. అంతేకాదు 51శాతం మంది విద్యార్థులు ఎలా ఫెయిల్‌ అవుతారని, కొన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు వచ్చి, వేరే సబ్జెక్టులో సున్నా మార్కులు ఎలా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్ధి సంఘాలు.

విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రశ్నలతో రాష్ట్ర విద్యాశాఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతేకాదు.. మొత్తానికి పరీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్‌ చేయాలా అనే ఆలోచనకు వచ్చింది. ఒకవేళ పాస్‌ చేస్తే మార్కులు ఎలా వేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ 35శాతం కనీస మార్కులు వేసి పాస్‌ చేయాలనే విషయాన్ని పరిశీలిస్తోంది. ఇక రివాల్యూయేషన్‌కు సంబంధించి ఇవాళ చివరి రోజు ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. అయితే ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News