TS Inter Supply Exam Results 2020: ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్

Update: 2020-07-27 05:17 GMT

TS Inter Supply Exams Results 2020: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్టుగానే ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్‌ బోర్డు ఫేలయిన విద్యార్ధులందరికీ కనీస పాస్‌ మార్కులను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఫలితాలను మరో రెండు మూడు రోజుల్లో బోర్డు ఫలితాలను వెల్లడించనుంది. మార్చిలో బోర్డు నిర్వహించిన వార్షిక పరీక్షలను రాసి, కొన్ని సబ్జె క్టుల్లో ఫెయిలైన విద్యార్ధులు కానీ, ఆ సమయంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాయలేని వారికి ప్రతి సబ్జెక్టులో 35 చొప్పున కనీస పాస్‌ మార్కులను ఇచ్చి పాస్‌ చేసేందుకు చర్యలు చేపట్టింది.

మొదటి సంవత్సరం విద్యార్ధులకు మాత్రమే కాకుండా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి ఫెయిలయిన విద్యార్ధులను కూడా పాస్‌చేసేలా చర్యలు చేపట్టింది. ఇక పోతే ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన వారు 1,47,519 మంది విద్యార్థులు ఉండగా, వారిలొ 20శాతం మంది విద్యార్థులు ప్రథమ సంవత్సర పరీక్షల్లో కూడా ఫెయిలయిన వారు ఉన్నారు. ఆ విద్యార్దులను కూడా బోర్డు పాస్‌ చేయనుంది. వీరందరికి ఆయా సబ్జెక్టుల్లో 35 చొప్పున కనీస పాస్‌ మార్కులివ్వనుంది.

ఇప్పటికే ఫేలయిన విద్యార్ధులను కంపార్ట్‌మెంటల్‌లో పాసై నట్లుగా ప్రకటించింది. మొత్తంగా 1,47,519 మంది విద్యార్థుల ఫలితాలను త్వరలోనే బోర్డు ప్రకటించనుంది. అందుకు అనుగుణంగా విద్యార్థి వారీగా ఫెయిలైన సబ్జెక్టులను గుర్తించి, వాటిల్లో కనీస మార్కులను వేసి, ఆయా విద్యార్థుల ఫలితాలను ప్రకంటించేలా చేపట్టిన ప్రక్రియ పూర్తి కావచ్చింది.

గ్రూపుల వారీగా సెకండియర్‌లో ఫెయిలైన విద్యార్థులు

సీఈసీ 56,341

ఎంపీసీ 42,427

ఎంఈసీ 7,416

బైపీసీ 25,292

హెచ్‌ఈసీ 5,581

ఇతరులు 148

మొత్తం 1,47,519

Tags:    

Similar News